ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రాజమౌళీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
Devara: రాజమౌళితో ఏ హీరో పని చేసిన కూడా.. ఆ తర్వాత చేసే సినిమాలు ఫ్లాప్ అయ్యే బ్యాడ్ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే.. దేవర జక్కన్న రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఇప్పటికే భారీ యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కించిన కొరటాల.. యాక్షన్ స్టంట్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లను కూడా రంగంలోకి దింపాడు. మొత్తంగా.. దేవర చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది.
ఖచ్చితంగా ఈ సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. తాజాగా దేవర 100 రోజుల్లో థియేటర్లోకి రానుందని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటి నుంచి సరిగ్గా మరో వంద రోజుల్లో దేవర థియేటర్లోకి రానుంది. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్.
All Hail TheTiger in theaters in 100 days from today.. And we can’t wait to unveil the glimpse soon.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మేకర్స్. ఇప్పటికే దేవర 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జనవరిలో ఫస్ట్ వీక్‌లో గ్లింప్స్ రిలీజ్ చేసి.. అదే సమయంలో దేవర షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేయనున్నాడు కొరటాల. జనవరి ఫస్ట్ వీక్‌లో దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. జనవరి 8న టీజర్ బయటికి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రజెంట్ కొరటాల పవర్ ఫుల్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నాడు. ఇక సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.