»Victory Venkatesh Saindhav Will Not Be Ordinary Third Single Is Coming
Victory Venkatesh: ‘సైంధవ్’ మామూలుగా ఉండదు.. థర్డ్ సింగిల్ వస్తోంది!
నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ నుంచి సైంధవ్ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో బ్యాక్ టు బక్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
Victory Venkatesh: నటుడిగా 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వెంకటేష్. ప్రస్తుతం హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తన కెరీర్ 75వ మూవీగా సైంధవ్‌ను చేస్తున్నారు వెంకీ. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 13న సైంధవ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. బుజ్జికొండవే అనే సాంగ్‌ను డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ బాగుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు శైలేష్ కొలను. సైంధవ్‌లో మొత్తం 9 ఫైట్ సీక్వెన్స్‌లు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు కమల్ హాసన్ విక్రమ్ రేంజ్లో ఉంటుందని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అందుకు తగ్గట్టే సైంధవ్ మామూలుగా ఉండదని చెబుతున్నారు. అయితే.. యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలివేషన్‌లా కాకుండా.. కథను ముందుకు తీసుకు వెళ్లేలా ఉంటాయని చెప్పాడు.
అన్ని ఫైట్ సీన్స్‌కి ఎమోషనల్ టచ్ ఉంటుందని తెలిపాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన సైంధవ్ గ్లింప్స్‌లో.. సౌత్ ఇండియాలో ఉన్న చంద్రప్రస్థ అనే పోర్ట్ ఏరియాలో.. వెంకీని పవర్ ఫుల్‌గా చూపించాడు శైలేష్. దీంతో ఈ సినిమా మరో విక్రమ్‌లా నిలిచేలా కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇది తన ఏజ్‌కు తగ్గట్టుగా కమల్ హాసన్‌కు కరెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు సైంధవ్ గ్లింప్స్ చూసిన తర్వాత.. సైంధవ్ వెంకీకి మరో విక్రమ్ అవడం పక్కా అని చెప్పొచ్చు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.