తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపింది.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డిసెంబర్ 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో అయిదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.
పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేస్తుందని అన్నారు. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని తెలిపారు.