పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓజి ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం సలార్ సినిమా అనే చెప్పాలి. సలార్‌ను కొట్టేలా ఓజి ఉంటుందని ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇదే సమయంలో ఓజి నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
OG: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో.. సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి పై భారీ అంచనాలున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ముంబైలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇమ్రాన్. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.
ఓ డై హార్డ్ ఫ్యాన్‌గా పవన్‌ను ఎలా చూపించాలో.. అంతకుమించి అనేలా చూపించబోతున్నాడు సుజీత్. అందుకు తగ్గట్టే డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. అయితే ప్రస్తుతం ఓజి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. పవన్ పాలిటిక్స్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఎలక్షన్స్ తర్వాతే మళ్లీ షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓజిలో పవన్‌కు సుజీత్ ఇచ్చే ఎలివేషన్.. సలార్‌కు మించి ఉంటుందని.. సలార్ రికార్డులను ఓజి బ్రేక్ చేస్తుందని ట్రెండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో.. ‘సలార్’ మూవీలో జగపతిబాబు కూతురుగా ‘రాధారమ’ పాత్రలో నటించిన శ్రియా రెడ్డి.. ఓజి అదిరిపోతుందని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనికి తోడుగా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓజి నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. పవర్ స్టార్‌కి సంబందించిన పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరింత గ్రాండ్‌గా మారనుంది.