»Is This The First Film Coming From Pawan As Deputy Cm
Pawan Kalyan: ‘డిప్యూటీ సీఎం’గా పవన్ నుంచి రానున్న ఫస్ట్ సినిమా ఇదే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సిఎంగా తన సేవలు అందించనున్నారు. అయితే.. డిప్యూటి సీఎంగా పవన్ నుంచి రాబోయే ఫస్ట్ సినిమా ఏంటి?
Is this the first film coming from Pawan as 'Deputy CM'?
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఫస్ట్ సినిమా ఏది అంటే? ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలన్ని కొంత వరకు షూటింగ్ జరుపుకొని.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో పవన్ డేట్స్ ఇచ్చే ఫస్ట్ సినిమా ఏది అంటే? హరిహర వీరమల్లు అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకోండని.. మేకర్స్‌కు పవన్ నుండి కబురు వెళ్లినట్లు సమాచారం. జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో హరిహర వీరమల్లు షూటింగ్ రీ స్టార్ట్ కానుందని అంటున్నారు.
అంతేకాదు.. రాజకీయంగా పవన్ విజయం సాధించిన తర్వాత థియేటర్లోకి రానున్న ఫస్ట్ సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో హరిహర వీరమల్లు పార్ట్-1 రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలకు వి.ఎఫ్.ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే.. ఓజి, ఉస్తాద్ సినిమాలకు కూడా వీలైనంత త్వరగా డేట్స్ సర్దుబాటు చేయాలనుకుంటున్నారట పవన్. త్వరలో ఈ చిత్ర నిర్మాతలను కలిసి, కాల్షీట్ల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాల కోసం రెండు నెలల సమయం కేటాయించి, తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండనున్నారని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.