ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ కల్కి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా భైరవ ఆంథమ్ వీడియో రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్ ఎలా ఉంది?
Bhairava Anthem Song: జూన్ 27న రిలీజ్ కానున్న కల్కి సినిమాకు.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దీపిక పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి భైరవ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పక్కా పంజాబీ స్టైల్లో సాగిన ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. నార్త్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చిన భైరవ ఆంథెమ్లో ప్రభాస్‌తో పాటు దిల్జీత్ కూడా కనిపించాడు. ఇక ఈ సాంగ్‌లో ప్రభాస్ లుక్ మాత్రం కేక పుట్టించేలా ఉంది. ఈ వీడియో సాంగ్ మధ్య మధ్యలో కల్కి ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ వాడారు. కానీ కల్కి సెట్లోనే ప్రభాస్, దిల్జిత్ పై ఈ సాంగ్ షూట్ చేశారు.
దీంతో.. భైరవగానే కాకుండా నయా లుక్‌లో కనిపించాడు డార్లింగ్. స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో యమా స్టైల్‌గా ఉన్నాడు. ప్రభాస్ వాకింగ్ స్టైల్‌కు ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. అయితే.. పంజాబీ స్టైల్ సాంగ్ కాబట్టి.. తెలుగు ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ, ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. కానీ, తెలుగు, పంజాబీ కలయికలో పాట ఉండటంతో డార్లింగ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. నార్త్ ఆడియెన్స్ మాత్రం ఈ పాటకు ఫిదా అయ్యేలా ఉన్నారు. ఈ పాటతో బాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అవడం పక్కా. తెలుగులో సాలిడ్ బజ్ రావాలంటే.. మరో అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేయాల్సిందే. లేదంటే.. అంతకుమించిన ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంది. అది.. అమరావతిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి కల్కి అంచనాలు పీక్స్‌కు వెళ్లనున్నాయి. మరి కల్కి ఎలా ఉంటుందో ఉంటుందో చూడాలి.