HYD: న్యూ ఇయర్ వేడుకల్లో హైదరాబాద్‌ను జీరో డ్రగ్స్ నగరంగా మార్చే లక్ష్యంతో సిటీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఐసీసీసీలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. పబ్బులు, హోటళ్లు, ఈవెంట్ వేదికలపై హాక్ఐడ్ నిఘా కొనసాగుతుందని, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారిపై ప్రత్యేక గమనిక ఉంటుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.