VSP: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1వరకు పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలాల ప్రజలు, GVMC వార్డుల నివాసితులు వినతి పత్రాలు సమర్పించవచ్చని క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఫిర్యాదుదారులు ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.