NLG: నకిరెకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు ఇవాళ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్, ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మందుల సామ్యేల్ హాజరవుతారని తెలిపారు.