MBNR: CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా.. 215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.