ATP: శింగనమల నియోజకవర్గ అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. నెట్వర్క్ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ ఫోన్లు అందించారని తెలిపారు. దీంతో ICDS సేవలు లబ్ధిదారులకు వేగంగా అందుతాయని పేర్కొన్నారు. అనంతరం ‘వీర్ బాల్ దివాస్’ కరపత్రాలను విడుదల చేశారు.