Pawan Kalyan: చరిత్రకే సరికొత్త చరిత్ర పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం శిరసెత్తిన జ్వాజ్వల్యమాన పరాక్రమవిక్రమం. పవన్ కళ్యాణ్ జనశ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచునగారా. కదనకాహళి పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులిగాండ్రింపు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం శిరసెత్తిన జ్వాజ్వల్యమాన పరాక్రమవిక్రమం. పవన్ కళ్యాణ్ జనశ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచునగారా. కదనకాహళి పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులిగాండ్రింపు.
అతడొక అనుక్షణిక నిరంతర క్రియాశీలి
నెత్తుటిని ఉడికెత్తించే ఉప్పెన…రేపటి కోసం ఎలుగెత్తిన దీవెన
పవన్ కళ్యాణ్…. ఈ పేరు వింటేనే దడ….గుండె గడగడ. అతడి ఉపన్యాసంలో చిమ్మిన ప్రతీ మాటా నిప్పురవ్వల తూటా.
విజయానికి నివాళులిచ్చిన బావుటా.
చిన్నపాటి చినుకు తుఫానవుతుందంటే నమ్మలేని నిజం. కానీ తుపాన్‌కు ఆ చిన్నచినుకే మాతృక.
పవన్ కళ్యాణ్ ప్రయాణం అలాగే చిరు అడుగులతోనే ప్రారంభమైంది. కానీ అదే ప్రయాణం ఒకనాటికి ఝంఝామారుత ప్రభంజనమై, భుగభుగల అగ్నిశిఖరమై, ప్రచండమై, అప్రతిహతమై శిఖరాలకొనలపై విజయదుందుభిలను మ్రోగిస్తుంటే అదొక అపూర్వఘట్టం. తిరిగి రాయలేని సజీవకావ్యం. ఇదిలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేనివారు మాత్రం కలవరపడ్డారు.
ఏముందిలే…సినిమా నటుడే కదా అనుకున్నారు.
కానీ ఇది సినిమా కాదు…నిజజీవన సంగ్రామం, జయభేరిని నినదించిన ఎదురులేని సమరం అనిగానీ,
జనహృదయాలలో కొమ్ముచిమ్మిన విప్లవజ్యోతుల సమాహారం అని గానీ ఊహించని వారికి ఇది నిజంగా సింహస్వప్నమే అయింది.
పవన్ కళ్యాణ్ జూలువిదిలిస్తే, పంజా విసిరితే దాని ఫలితం.. పరిణామం…..పర్యవసానం ఇంత ఘాటుగా, ఇంత మోటుగా ఉంటుందా? ఇలా మరో మహోదయానికి వేకువ తొలికేక పెడుతుందా, ఇంతలా మరో ప్రపంచానిక మేలుకొలుపు అవుతుందా…..అని నిర్ఘాంతపోయి, నివ్వెరపోయి…నీరుకారిపోతున్నారే….
ఈ ప్రభంజనం….ఈ సంచలనం…ఇప్పటిదికాదు
తన గుండెలో జ్ఞానరేఖలు విచ్చుకుంటున్న తొలిక్షణాలలోనే పురిటికేక పెట్టింది.
విశ్వాంతర్గోళపు నలుదెసలా పవన్ చూపులు ప్రసరించినప్పుడే కేరింతలు కొట్టింది.
కేవలం తెరమీద హీరోయిజం కోసం కాదు…పవన్ కళ్యాణ్ పుట్టింది. ఈ జన్మకు మరేదో సార్ధకత దాగుంది. ఇంకేదో పరమార్ధం నిరీక్షిస్తోంది. ఎవరికీ తెలియని చరితార్ధత అదేదో మిగిలి ఉంది. తను చదివిన అనేకానేక పుస్తకాలలోని ప్రతీవాక్యం, ప్రతీ పదం పవన్ కళ్యాణ్ నరనరాలలో, అణువణువులో మానవత్వపు పరిమళాలను నింపింది. పండితులతో చేసిన స్నేహం, చదువరులతో అందిపుచ్చుకున్న సాహచర్యం, మేధావులతో నింపుకున్న సహవాసం….అన్నీ కలగలిపి మేళవింపుగా, జనకళ్యాణ మహోత్సవానికి ప్రారంభగీతికలు ఆలపించాయి. ఇది పవన్ కళ్యాణ్‌కు మాత్రమే తన చుట్టూ వ్యాపించిన ప్రకృతి అందించిన సందేశం. అతడు మాత్రమే గ్రహించిన గంధర్వయోగం ఇది.
నేలబారు మనస్తత్వాలు, చవకబారు మస్తిష్కాలకు పవన్ కళ్యాణ్‌లోని ఉరవడిలో పరిగెత్తిన ఉధృతి పాపం అర్ధం కాలేదు. కొట్టేస్తాం…నెట్టేస్తాం….కుమ్మేస్తాం అనుకున్నారు.
చులగ్గా కొట్టేయడానికి పవన్ కళ్యాణ్‌ది పలాయనవాదం కాదు. ఎవ్వరూ సడలించలేని పట్టుదల. తేలిగ్గా నెట్టేయడానికి పవన్ కళ్యాణ్ దూదిపింజకాదు. దుర్భేద్యమైన దుర్గం. కుమ్మేయడానికి పవన్ కళ్యాణ్ ఒంటరివాడు కాదు. కోట్లహృదయాలు ఆలపించే జాగృత గీతిక. ప్రగతిమార్గ కరదీపిక.
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం శిరసెత్తిన జ్వాజ్వల్యమాన పరాక్రమవిక్రమం…..
పవన్ కళ్యాణ్ జనశ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచునగారా….కదనకాహళి
పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులిగాండ్రింపు….
అందుకే ప్రజసమూహాలు ఆయన రాకకోసం ఎదురుచూపులు చూశారు. ఆయన పిలుపు కోసం పరితపించిపోయారు.
ఆయన పలకరింపుకోసం ఉవ్వెత్తున వాగులై, వంకలై, గండుశిలలను సైతం కొట్టుకొచ్చిన కైజారు కెరటాలై, తన్మయత్వపు తైతక్కల తరంగాలై ఉరికిఉరికి పవన్ కళ్యాణ్‌ను చుటుముట్టారు.
అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు మూకమ్ముడిగా, కౌరవకీచకసైంధవాధములు సమూహంగా, జనజీవన సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేస్తుంటే, కళ్ళెదుటే, పట్టపగలే అమాయకులను ఏమార్చేస్తుంటే, కటికిచీకటి తెరలవెనుకకు జార్చేస్తుంటే … అదిగో అప్పుడు కదా… పవన్ కళ్యాణ్ పరిగెత్తాడు. అప్పుడు కదా అతడు గొంతు విప్పాడు. అప్పుడు కదా ప్రజామార్గంలో గుండెలను పరిచాడు. ప్రతీగుమ్మం చేరుకున్నాడు. ప్రతీ ఎదలోని రొదను, గొంతులోని వేదనను విన్నాడు. ఒక్కసారిగా విలయతాండవం చేశాడు. వీరఖడ్గమై మెరిశాడు.
సముద్రఘోషతో, జవనాశ్వపు హేషతో, ఐరావతఘీంకారంతో హూంకరించి, హుటాహుటిన శిరసత్తి, శివమెత్తి, అట్టడుగు ప్రజానీకపు ఆకలికేకలా హోరిత్తిపోయాడు. తూరుపుదిక్కును చింపుకుని, ప్రజాస్వామ్యపు ఆశాకిరణమై ప్రవహించాడు. ఫలితం…చరిత్ర ఎరుగుని విజయాన్ని ప్రజలకు కట్టబెట్టాడు. కరడుగట్టిన చరిత్రను చెరపేసి, తనదైన చరిత్రను ముద్రించాడు. తానే ఒక చరిత్రై ధరిత్రివ్యాప్తమయ్యాడు. అంతరిక్షాలను ధిక్కరించిన విశ్వమానవుడిగా అవతరించాడు. అవును పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. కాదు కాదు….చరిత్రకే సరికొత్త చరిత్ర.