sruthi hasan : తండ్రికి తగ్గ తనయగా చిత్ర రంగంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్. నటిగానే కాకుండా సింగర్‌గానూ తన ట్యాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన తండ్రి బయోపిక్(biopic) విషయంలో ఆమె స్పందించారు. నాన్న తన సూపర్ హీరో అంటూ ఆమె కొనియాడారు. మరింతకీ కమల్ హాసన్ బయోపిక్‌కి శృతి దర్శకత్వం వహించనున్నారా? అంటే కాదనే ఆమె సమాధానం ఇస్తున్నారు.
కమల్‌హాసన్(kamal haasan) గురించి, ఆయన బయోపిక్ గురించి శృతి హాసన్(sruthi hasan) తాజాగా మాట్లాడారు. తన తండ్రి ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటారంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా ఆయనకు స్టోరీ నెరేషన్ చేస్తుంటే క్లాస్‌లో ఉండే చిన్న పిల్లాడిలా దాన్ని వింటారన్నారు. ఇక బయోపిక్ డైరెక్షన్ విషయానికి వస్తే అందుకు తాను సరైన వ్యక్తిని కాదని అన్నారు. దర్శకత్వం అనేది ఎంతో బాధ్యతతో కూడిన పని అంటూ చెప్పుకొచ్చారు. ఎందరికో స్ఫూర్తిని ఇచ్చే అలాంటి పని చేయడానికి తాను సరైన వ్యక్తిని కాదంటూ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎందరో ట్యాలెండెట్ దర్శకులు ఉన్నారని గుర్తుచేశారు. వాళ్లయితేనే అలాంటి సినిమాల్ని బాగా తెరకెక్కించగలరి చెప్పారు.
కమలహాసన్ ‘ఇండియన్2’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలు తాజాగా జరిగాయి. ఆ వేదికపై తన తండ్రి పాటల్ని శృతి ఆలపించారు. అది చాలా గొప్ప అనుభూతి అంటూ చెప్పుకొచ్చారు. ఇక శృతి తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆమె మూడు సినిమాల్లో నటిస్తున్నారు. సలార్‌కి కొనసాగింపుగా వస్తున్న సలార్ శౌర్యంగ పర్వం సినిమాలో శృతి కనిపించనున్నారు. చెన్నై స్టోరీలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అడవి శేష్ హీరాగా తెరకెక్కుతున్న ‘డకాయిట్’ సినిమాలోనూ నటిస్తున్నారు.