»How Is Yatra 2 Starring Mammootty And Jiva The Ys Jagan Biopic
Yatra 2: యాత్ర 2 ఎలా ఉంది? హైలెట్ డైలాగ్స్ ఇవే?
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2.. ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చేసింది. ఏపిలో వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? హైలెట్ అవుతున్న డైలాగ్స్ ఏంటి?
How is Yatra 2 starring Mammootty and Jiva, the YS Jagan biopic?
Yatra 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా.. 2019లో రిలీజ్ అయి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ సినిమాని రిలీజ్ చేశారు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపించగా.. కోలీవుడ్ హీరో జీవా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వై.ఎస్.జగన్ రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటి? అనేదే యాత్ర2 కథ. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ సినిమాను యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన్ లీఫ్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు.
ఫైనల్‌గా యాత్ర2 సినిమా ఫిబ్రవరి 8 థియేటర్లోకి వచ్చేసింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అని అంటున్నారు. కాకపోతే డాక్యుమెంటరీ ఫీల్ వచ్చిందనే టాక్ నడుస్తోంది. కానీ దర్శకుడు మహీ ఈ సినిమాను ఆసక్తికరంగా చిత్రీకరించినట్టుగా చెబుతున్నారు. ఎవరి పాత్రలను కూడా తక్కువ చేయకుండా.. గేలి చేయకుండా.. చాలా వరకు నచ్చే లాగే సినిమా తీశాడని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట. పిల్లిని అడవిలో వదిలినా పిల్లే, పులిని బోనులో పెట్టినా పులే.. అతను సూసైడ్ బాంబర్ లాంటి వాడు, వాడితో పాటు మనల్నీ తీసుకుపోతాడు.. కడపోళ్ళకి ఎండలు, కష్టాలు కొత్త కావు.. రాజకీయాలు నాయకులకే కానీ, కార్యకర్తలకు తెలియవు.. అనే డైలాగ్స్ అదిరిపోయాయిని అంటున్నారు. ఏదేమైనా యాత్ర2 మాత్రం బాగానే ఉందని అంటున్నారు.