తమిళ హీరో శివకార్తికేయన్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘సెయాన్’. ఇందులో భాగ్యశ్రీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు టాక్. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.