దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమాకు సెన్సార్ కష్టాలు తప్పడం లేదు. క్లియరెన్స్ కోసం రివైజింగ్ కమిటీ దగ్గరకు నిర్మాతలు వెళ్లగా మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన రివైజింగ్ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం క్షీణించడంతో స్క్రీనింగ్ నిలిపివేశారు. మళ్లీ కొత్త డేట్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.