Devara Movie: సీరియస్‌గా ఉన్న ‘దేవర’.. నెక్స్ట్ భారీ యాక్షన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రెండు, మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు తారక్. అక్కడ కూడా తగ్గేదేలే అంటున్నాడు తారక్.
నాన్‌స్టాప్ షూటింగ్‌కు గ్యాప్ ఇస్తూ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లిన యంగ్ టైగర్(NTR).. కనీసం ఓ వారం రోజులైనా రిలాక్స్ అవుతాడని అనుకున్నారు. కానీ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నఓ ఫొటో బయటికి రావడంతో.. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇంట్లో ఉన్నా, వెకేషన్లో ఉన్నా.. ఎక్కడైనా సరే వర్కౌట్ విషయంలో మార్పు ఉండదని.. ఒకే ఒక్క ఫోటోతో చెప్పేశాడు యంగ్ టైగర్. సీరియస్ లుక్‌లో కండలు పెంచుతున్న చిరుతలా ఉన్న తారక్‌ను చూస్తుంటే.. నిజంగా భయమేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. సినిమాలో మృగాలను భయపెట్టేందుకు దేవర ఎంత భయంకరంగా ఉంటాడో ఈ ఒక్క ఫోటో చూస్తే చెప్పొచ్చు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఓపెనింగ్ రోజు కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్.. దేవర పై అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్‌లో యాక్షన్ సీన్స్నే ఎక్కువగా షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్లోను హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో దేవర(Devara Movie) కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఎన్టీఆర్(NTR) వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. తారక్, సైఫ్ అలీ ఖాన్ మధ్య కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ను కూడా వేశారట. అలాగే ఈ షెడ్యూల్లో జాన్వీ కపూర్ పై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జూన్ నెల మొత్తం కాల్ షీట్స్ ఇచ్చేశాడట. ఆ నెలలో ఎలాంటి యాక్టివిటీస్ పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారట. మరి దేవర ఎలా భయపెడతాడో చూడాలి.