మద్యానికి బానిస కావడం వ్యక్తిగత పతనం కాదని, దాన్నొక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా చూడాలని బాలీవుడ్ నటి జాన్వీకపూర్ అన్నారు. ఇటీవల ఓ సెమీనార్‌లో జాన్వీ పాల్గొని మాట్లాడారు. మద్యానికి బానిసైన వాళ్ల క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్దతి కాదని, నిజానికి ఏ వ్యసనమైనా విలాసం కాదన్నారు. సమాజం వారిని నేరస్థుల్లా కాకుండా.. చికిత్స అవసరమైన రోగుల్లా గుర్తించాలన్నారు.