బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. పంజాబ్లో వరదల బాధితుల సహాయార్థం రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. తాను ఇచ్చే ఈ మొత్తాన్ని విరాళంగా కాకుండా ప్రజలకు చేసే సేవగా భావిస్తానని పేర్కొన్నాడు. గతంలో కరోనా సమయంలో కూడా అక్షయ్ PM సహాయనిధికి రూ.25 కోట్లు భారీ విరాళం ప్రకటించాడు.