టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ది డెడ్లీ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మిగతా దర్శకులతో పోలిస్తే.. సుకుమార్ సినిమాలకు నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇస్తాడు దేవి. ఇప్పటి వరకు దేవి లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు సుక్కు. అలాంటి ఈ ఇద్దరి మధ్య క్లాష్ వచ్చిందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మన లెక్కల మాస్టారు సుకుమార్ రైటింగ్స్ పై చిన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె సుకుమార్ రైటింగ్స్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా మొదలైంది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సుక్కు ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాకు కూడా దేవిశ్రీయే మ్యూజిక్ అని అనుకున్నారు. కానీ దేవిశ్రీని పక్కన పెట్టేసి.. అతని ప్లేస్‌లో ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్‌నాథ్‌ని తీసుకున్నారు.
దాంతో దేవి, సుక్కు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరిగిందనే టాక్ ఊపందుకుంది. ఫలితంగా ఇద్దరి మధ్య బడ్జెట్ క్లాష్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం దేవి ఏకంగా 4 కోట్ల డిమాండ్ చేశాడట. అయితే తక్కువ బడ్జెట్లో సినిమాను కంప్లీట్ చేయాలని బావించిన సుకుమార్.. రెండు కోట్లతో బేరం ఆడినట్టు తెలుస్తోంది. అందుకే దేవి తప్పుకున్నాడని టాక్. పైగా పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.. కాబట్టి సుకుమార్ కూడా దేవిని వద్దని చెప్పాడట. మొత్తంగా దేవి లేకుండా సుకుమార్ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కానుందని చెప్పొచ్చు.