GNTR: తాడికొండ మండలం మోతడక గ్రామంలోని చాకలి చెరువు వద్ద కోతముక్క ఆడుతున్న జూదరులపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 47,400ల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు.