మహేష్, రాజమౌళిల ‘వారణాసి’ మూవీపై మలయాళ హైర్ టోవినో థామస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఏ నటుడికైనా ఒక కల అని, ఒకవేళ ఆయన ‘వారణాసి’లో తనకు రావణుడి పాత్రను ఆఫర్ చేస్తే కళ్లు మూసుకుని ఓకే చెబుతానని తెలిపాడు. రావణుడి వంటి శక్తివంతమైన, కఠినమైన పాత్రను రాజమౌళి విజన్లో పోషించడం ఒక అద్భుతమైన అవకాశమని, ఈ పాత్ర కోసం తాను ఎంతటి శ్రమకైనా సిద్ధమని చెప్పాడు.