ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను తలకిందుకు చేసింది. దాంతో కోట్ల నష్టం తప్పదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆదిపురుష్ టీజర్‌కు నెగెటివ్ రెస్సాన్స్ రావడంతో.. మళ్లీ ఈ సినిమా కోసం కసరత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం దర్శకుడు ఓం రౌత్ విఎఫ్ఎక్స్ పై వర్క్ చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. అలాగే రీషూట్ కూడా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికోసం చాలా సమయం పట్టేలా ఉందంటున్నారు. అందుకే ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని.. సమ్మర్లో రాబోతోందని వినిపిస్తోంది. అయితే మళ్లీ ఈ సినిమా పై వర్క్ చేస్తున్నారంటే.. అది మాటలతో అయిపోయే వ్యవహారం కాదు. దానికోసం మేకర్స్ మళ్లీ కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అందుకే ఆదిపురుష్ రీ వర్క్ కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ లెక్కన ఎంత కాదనుకున్నాదాదాపు వంద కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నారట. ఇదే నిజమైతే.. ఆదిపురుష్‌కు భారీ టార్గెట్ సెట్ అయినట్టేనని అంటున్నాఉ. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ముందు ఆదిపురుష్ పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.. టీ సిరీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.