ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ సాగే ఈ పాటను హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల పై డిజైన్ చేశారు. సాంగ్ బయటికి రావడమే లేట్ అన్నట్టు.. దారుణంగా నెగెటివ్ ట్రెండ్ అవుతోంది.
Guntur Karam: గుంటూరు కారం (Guntur Karam) సినిమా రిలీజ్‌కు సరిగ్గా మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చూసిన దమ్ మసాలా బిర్యానీ సాంగ్ మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల పై ఈ సాంగ్ డిజైన్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్న మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలంది.
మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఈ పాట అస్సలు నచ్చినట్లు లేదు. అందుకే.. సోషల్ మీడియాలో రిలీజ్ అవగానే దారుణంగా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. #OhMyBaby ట్యాగ్ క్రియేట్ చేసి.. తమన్ పై ఓ రేంజ్లో నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు గుంటూరు కారం సినిమా రేంజ్ పాట కాదు, సాంగ్ అస్సలు బాగాలేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం సాంగ్, ఇవేం లిరిక్స్ అంటూ మండి పడుతున్నారు. ఎంతలా అంటే.. ఓ మై బేబీ పాటని సినిమా నుంచి తీసేయండి, ఇంకో పాటని రీప్లేస్ చేయండి అని కూడా అంటున్నారు.
గతంలో కూడా తమన్ సాంగ్స్ పై ట్రోల్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ సారి మాత్రం బాబోయ్ ఇదేం సాంగ్ అనేలా మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై తమన్ రియాక్ట్ అవుతాడేమో చూడాల్సి ఉంది. లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి మాత్రం నెగెటివ్ ట్రెండ్ చేస్తున్న వారిపై రియాక్ట్ అయ్యారు. Social media is going to DOGS.. …people who do not know a thing abt the process..think that they can comment and judge…with all d ill intentions..of spreading hate..targeting the technicians…NO..NOT at all good..ఎవరో ఒకరు మాట్లాడాలి..గీతలు దాటుతున్నారు వీళ్ళు.. అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. మరి శాస్త్రి చెప్పినట్టుగా.. ఇలాంటి వాటిపై ఎవరు మాట్లాడుతారో చూడాలి.