Bhola Shankar: ‘భోళా శంకర్’ అదిరిపోయే మ్యూజిక్ అప్డేట్!
ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది.
బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య.. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వరుస ఫ్లాపులు అందుకొని.. అవకాశాలు లేకుండా చేసుకున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. అయితే ఎట్టకేలకు చాలా కాలం తర్వాత మెహర్ రమేశ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఓ ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా రీమేకే. తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’ రిమేక్‌గా తెరకెక్కుతోంది భోళా శంకర్. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే మెగాస్టార్ లుక్స్ రిలీజ్ చేయగా భోళా శంకర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ మాస్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు మేకర్స్. బోళా మేనియా త్వరలోనే షురూ అవుతుంది.. అంటూ మెగాస్టార్ స్టైలిష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. భోళా శంకర్ హుక్ స్టెప్‌కు హింట్ ఇస్తూ.. మెగాస్టార్ డాన్స్ చేస్తున్న స్టైలిష్ స్టిల్‌ని రివీల్ చేశారు.
ఈ సందర్భంగా.. అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానుందని.. భోళా శంకర్ మ్యూజిక్ మేనియా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో త్వరలోనే బోళా శంకర్ నుంచి అదిరిపోయే సాంగ్స్ బయటికి రాబోతున్నాయని చెప్పొచ్చు. మరి భోళా శంకర్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి.