నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ‘జై బాలయ్య’ నినాదంతో థియేటర్ దద్దరిల్సాల్సిందే. బాలయ్య సినిమాలు కూడా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపేలా ఉంటాయి. ప్రస్తుతం బాలయ్య లైనప్ అంతకు మించి అనేలా ఉంది. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.
మరో వైపు అన్‌స్టాపబుల్ సీజన్ 2తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు బాలయ్య. అందుకే ఫ్యాన్స్ కూడా తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్య తెలుగులో హిట్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పోకిరి, ఒక్కడు, జల్సా, తమ్ముడు సినిమాల స్పెషల్ షోస్ వేసి రికార్డ్స్ క్రియేట్ చేశారు అభిమానులు. ఇక ఇప్పుడు బాలయ్య హై ఒల్టేజ్ మాస్ మూవీ ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. 2002లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ ఏడాదితో 20 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ బాలయ్య అభిమానులు సెప్టెంబర్ 24, 25 తేదీల్లో 30కి పైగా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోను రంగం సిద్దం చేస్తున్నట్టు టాక్. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. ఇక వివి వినాయక్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.