ప్రధాని మోదీని బాలీవుడ్ నటి కరీనా కపూర్ మర్యాదపూర్వకంగా కలిసింది. తన తాతయ్య రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా ప్రధానిని తమ కుటుంబ సభ్యులు కలిసినట్లు ఆమె పేర్కొంది. తమ కుమారులు తైమూరు, జెహ్ కోసం ప్రధాని నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోలను కరీనా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెతో పాటు ఈ సమావేశంలో కరీనా, సైఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, కరిష్మా కపూర్ పాల్గొన్నారు.