బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగు కూడా నేర్చుకొని అందరి మన్ననలు పొందారు.ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అలియా. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ ఆమె పస్ట్ మూవీ. తొలి సినిమాతోనే అందంతో నటనతో కట్టిపడేసింది ఈ చిన్నది. బాలీవుడ్ (Bollywood) లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఈ చిన్నది పరిచయమయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది అలియా.
ఈ మూవీలో రామ్ చరణ్ (Ram Charan) కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె కనిపించేది తక్కువే అయినా అద్భుతంగా నటించి అలరించింది. ఇక అలియా భట్ ప్రస్తుతం హాలీవుడ్ లో నటిస్తుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone movie) అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది అలియా. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ఈ వయ్యారి.అలియా భట్ (Alia Bhatt) ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఓ మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న అలియా. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ హీరో, హీరోయిన్లకు తెలుగు నేర్పించారు. ‘అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు..’ అని ఎలా పలకాలో తన కో స్టార్ గాల్ గాడోట్‌కు (Gal Gadot) నేర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా క్యూట్‌గా మాట్లాడారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాను ఇప్పటి వరకు టాటూ వేయించుకోలేదని తెలిపారు. రణ్ బీర్(Ran Bir), తాను ఒకేలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ‘నాటు నాటు’ పాటను పాడి.. దానికి డ్యాన్స్ మూమెంట్స్ (Moments) వేశారు.