Prabhas : 'ఆదిపురుష్'ను డైరెక్టర్ ఓం రౌత్ ఏం చేస్తాడోనని.. కాస్త టెన్షన్‌గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ పై డౌట్స్ పెరిగాయి. టీజర్లో గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. అయితే ఒకవేళ విజువల్ పరంగా ఓం రౌత్ సక్సెస్ అయితే మాత్రం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం పక్కా.
‘ఆదిపురుష్’ను డైరెక్టర్ ఓం రౌత్ ఏం చేస్తాడోనని.. కాస్త టెన్షన్‌గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ పై డౌట్స్ పెరిగాయి. టీజర్లో గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. అయితే ఒకవేళ విజువల్ పరంగా ఓం రౌత్ సక్సెస్ అయితే మాత్రం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం పక్కా. లేదంటే మాత్రం టీజర్ లాగే సీన్ రివర్స్ అవుతుందనడంలో.. ఎలాంటి సందేహాలు లేవు. కానీ అవుట్ పుట్ మాత్రం అనుకున్నంత స్థాయిలో వస్తుందనేది.. లేటెస్ట్ టాక్. ఇది నమ్మాలంటే ఆదిపురుష్ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రావాల్సిందే. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా.. బిగ్ అప్టేట్ ఆశిస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో.. ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. జూన్ 16న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మే నెల వరకు ట్రైలర్ వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. కానీ మధ్యలో టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక వన్స్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశాక.. ప్రమోషన్స్ పరుగులు పెట్టించాలని చూస్తున్నాడట ఓం రౌత్. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి సినిమా పోస్ట్‌పోన్ ఛాన్సే లేదంటున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటిస్తున్నాడు. మరి దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న.. ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.