Adhipurush : ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రెండిగ్లోనే ఉంటోంది. కానీ టీజర్ తర్వాత సీన్ మారిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ పై ఎక్కడ లేని డౌట్స్ వచ్చేశాయి. దాంతో సమయం వచ్చినప్పుడల్లా.. అతనిపై మండిపడుతునే ఉన్నారు. కానీ ఈ సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్.
ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రెండిగ్లోనే ఉంటోంది. కానీ టీజర్ తర్వాత సీన్ మారిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ పై ఎక్కడ లేని డౌట్స్ వచ్చేశాయి. దాంతో సమయం వచ్చినప్పుడల్లా.. అతనిపై మండిపడుతునే ఉన్నారు. కానీ ఈ సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్. ఆ నమ్మకంతోనే ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్ కోసం ఎదురు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయోధ్యలో టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి మరో అప్డేట్ రాలేదు. జూన్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకో రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూశారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. అప్డేట్ ఇవ్వడానికి శ్రీరామనవమి కంటే మంచి సందర్భం మరోటి లేదని భావించారు. దాంతో ఆదిపురుష్ నుంచి మరో కొత్త టీజర్, ట్రైలర్ లేదా సాంగ్ అయినా వస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ డిసప్పాయింట్ చేసేశాడు డైరెక్టర్ ఓం రౌత్. జస్ట్ పోస్టర్‌తోనే సరిపెట్టాడు. అయితే ఈ స్పెషల్ పోస్టర్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ఈ పోస్టర్లో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ కనిపిస్తుండగా.. పక్కన లక్ష్మణుడు, ఆంజనేయుడు కూడా ఉన్నారు. మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. అయితే ఇప్పటి నుంచి ‘ఆదిపురుష్’ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడుంటుందో చూడాలి.