తాను తనకు జరిగిన యాక్సిడెంట్ (accident) గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు (Tollywood actor) సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అన్నారు. ఈ ప్రమాద ప్రభావం తన సినిమాల (Tollywood) పైన ఉంటుందని కొంతమంది అనుకున్నారని, కానీ అసలు ఆ యాక్సిడెంట్ సంగతిని తాను మరిచిపోయానని, దానిని ఓ స్వీట్ మెమోరీ కింద లాక్ చేసి పెట్టుకున్నానని చెప్పారు. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, ఇక నుండి సినిమాల్లో తాను గ్యాప్ తీసుకోవడం ఉండదని చెప్పారు. సినిమాలను వరుసగా చేస్తానని చెప్పారు. తేజ్ హీరోగా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష చిత్రం ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ (NTR voice over) ఇచ్చారు. ఇది తమకు ప్లస్ అయిందని సాయి ధరమ్ అన్నారు. తారక్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, ఈ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించామని, అడగ్గానే అంగీకరించాడని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేయగా.. నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తానని తనకు మాట ఇచ్చాడన్నారు. ఆయన వాయిస్ ఓవర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుందన్నారు.
చాలా రోజుల తర్వాత విరూపాక్ష సినిమాతో తాను స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు చెప్పారు. 2019లో చిన్న ఆఫీస్ లో ఈ కథ విన్నానని, ముందుగా సుకుమార్ (Sukumar) నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మొదట కథ విను.. నీకు నచ్చుతుంది.. చేస్తావ్ అని తనతో అన్నారని చెప్పారు. సుకుమార్ గారు కదా?.. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నానని, కానీ డైరెక్టర్ కార్తీక్ మాత్రం తనను భయపెట్టాడన్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యామన్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. పాటలు కూడా అందరికీ నచ్చుతాయన్నారు. తనకు సెట్లో ఆరోగ్యం బాగా లేకపోయినా తన కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయని, తమ నిర్మాతలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. హారర్ సినిమా చూడటం ఓ చాలెంజింగ్ అని, ఇక నటించడం ఇంకా పెద్ద చాలెంజ్ అన్నారు. తారక్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, తాము చాలా క్లోజ్‌గా ఉంటామన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.