»A Fire Broke Out On The Set Of Megastar Acharyas Movie
Acharya Movie Set : మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా సెట్లో అగ్నిప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) 'ఆచార్య'(Acharya) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదిన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టాలీవుడ్(Tollywood)లో పరాజయం పొందింది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని కోకాపేటలో ఓ ఖాళీ స్థలంలో 20 ఎకరాల్లో ప్రత్యేక సెట్(Set)ను వేసి షూటింగ్ చేపట్టారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ‘ఆచార్య'(Acharya) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదిన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టాలీవుడ్(Tollywood)లో పరాజయం పొందింది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని కోకాపేటలో ఓ ఖాళీ స్థలంలో 20 ఎకరాల్లో ప్రత్యేక సెట్(Set)ను వేసి షూటింగ్ చేపట్టారు.
ధర్మస్థలి టెంపుల్, గాలి గోపురం, ఓ గ్రామాన్ని మరిన్ని హంగులతో సెట్(Set) వేశారు. ఈ సెట్ కోసం రూ.20 కోట్ల వరకూ ఖర్చయ్యింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఈ సెట్ ఎంతో అద్భుతంగా వేశారు. ఈ సెట్ అద్భుతంగా ఉందంటూ అందరి నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా(Movie) అయిపోయినా కూడా ఆ సెట్(Set)ను అలానే ఉంచేశారు. ప్రస్తుతం ఆ స్థలం ఖాళీగానే ఉండటంతో సెట్ బాగుందని అలా వదిలేశారు.
తాజాగా ఆ సెట్లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సెట్ లోపల మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ధర్మస్థలి టెంపుల్, ఆ చుట్టుపక్కల చాలా వరకూ మంటల్లో కాలిపోయింది. దీంతో కోట్ల విలువైన సెట్(Set) కాలిపోయి బూడిదైంది. ఓ వ్యక్తి సిగరెట్ కాల్చి సెట్ లో వేయడంతో ఇలా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై ఆచార్య(Acharya) టీమ్ సభ్యులెవరూ స్పందించలేదు.