‘ధురంధర్ 2’ మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు ఆదిత్య ధర్ కృతజ్ఞతలు చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాడు. గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.