»Summer Tips If You Travel In Summer These Precautions Are A Must
Summer Tips: వేసవిలో ప్రయాణాలు చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వేసవి వచ్చిందంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం, నీరసం, అలసట వంటివన్నీ ఉంటాయి. అందులోనూ కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వేసవిలో ఎక్కువగా దూరప్రయాణాలు చేసేవాళ్లు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
Summer Tips: If you travel in summer.. these precautions are a must!
Summer Tips: ఎండలో తిరగడం వల్ల బాడీలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీంతో బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. అలాగే ఎనర్జీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతుండాలి. అలాగే ఈ ఎండకి చర్మం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్లోషన్ అప్లై చేయడం మంచిది. వీటితో పాటు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆయిల్, మసాలా, జంక్ ఫుడ్ వంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండాలి. శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి బోండాలు వంటివి తీసుకోవాలి. ప్రయాణాల్లో వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురికాదు. వీటితో సబ్జా గింజలను కూడా తీసుకోవడం వల్ల వేసవిలో చలవ చేస్తుంది. చికెన్, మటన్ వంటి ఫ్రై కర్రీలు వేసవిలో తక్కువగా తినాలి. కేవలం ఎండకాలంలో మాత్రమే దొరుకుతాయని మామిడిని ఎక్కువగా తింటే వేడి పొక్కులు వస్తాయి. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోండి.