తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు.
TDP: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించారు. దీంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. అతనికి మాడుగుల స్థానాన్ని ఇవ్వనున్నారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ కేటాయింటే అవకాశముంది. ఎంఎస్ రాజు మడకశిర నుంచి బరిలో నిలిచే అవకాశముంది. వెంకటగిరి స్థానాన్ని రామకృష్ణకి కేటాయించే అవకాశముంది. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ ఫారాలను పెండింగ్లో ఉండే అవకాశముంది. అనపర్తి స్థానంపై క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రెండు స్థానాలకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. అయితే అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు.