ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. రోజుకి రెండు ఖర్జూర పలుకులు తినడం వలన ఎన్నో లాభాలున్నాయి.
Dates: రోజుకి రెండు ఖర్జూర పలుకులు తినడం వల్ల తక్షణమే బలం వస్తుంది. ఇందులోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6 రక్తపోటును కంట్రోల్ చేసి ఎముకలను ఆరోగ్యంగా చేస్తాయి. బాగా నీరసంగా ఉంటే రెండు ఖర్జూరాలను తింటే బలం వస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు రావు. ఇందులోని కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువ. అలాగే ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఖర్జూరాన్ని పాలలో రాత్రి నానబెట్టి తింటే ఆరోగ్యానికి మంచిది. ఇవి మలబద్ధాకాన్ని కూడా దూరం చేస్తాయి. ఖర్జూరంలోని మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడతాయి. ఇందులో విటమిన్ డి, సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడాయి. అలాగే యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. వీటిని ఉదయం తినడం చాలా మంచిది. లేదా బనానా మిల్క్ షేక్లో వేసుకుని చేసినా మంచిదే.