ఎంత చిన్న సినిమా అయిన సరే, కనీసం రెండు వారాల గ్యాప్‌తో ఓటిటిలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్‌ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటిటిలోకి రావడం విశేషం.
Krishnamma: ఇటీవలె సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కృష్ణమ్మ’ సినిమా థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై ఆయన స్నేహితుడు కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. సత్యదేవ్ సరసన అతీరా రాజ్ హీరోయిన్గా నటించింది. ఇక మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ విడుదలైన వారానికే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం.
అది యకూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటిటిలోకి వచ్చేసింది కృష్ణమ్మ. మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. రిలీజ్ అయిన వారానికే ఈ సినిమా ఓటిటిలోకి రావడంతో.. సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. కానీ ఓటిటి లవర్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఎంత చిన్న సినిమా అయిన సరే, కనీసం రెండు వారాల గ్యాప్‌తో ఓటిటిలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్‌ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి.
కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటిటిలోకి రావడం విశేషం. ఈ సినిమాను రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ ప్రమోట్ చేశారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఎన్నికల ఎఫెక్టా? లేక మరో కారణమా? అనేది తెలియదు గానీ, థియేటర్లో మాత్రం అనుకున్నంత రీచ్ మాత్రం అందుకోలేకపోయింది కృష్ణమ్మ. మరి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.