పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమాలో ఒక్కటే పాట ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Prabhas: మే 9న రావాల్సిన కల్కి సినిమా.. ఫైనల్‌గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. త్వరలోనే ప్రభాస్‌తో స్పెషల్ ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. కల్కి సినిమా మొత్తానికి ఒక్కటే పాట ఉంటుందని తెలుస్తోంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో భాగంగా బిట్ సాంగ్స్ ఉంటాయట. ఇది తప్పితే సినిమాలో మరో పాట లేదని సమాచారం.
ఇక ఆ ఒక్క పాట కూడా ఇదేనని చెప్పాలి. గతంలో ‘టా టక్కరా’ అనే సాంగ్ బిట్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ వామప్ చేస్తున్న చిన్న బిట్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబందించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ సరిగమ సొంతం చేసుకుందని ప్రకటించారు. దీంతో.. కల్కి నుంచి ‘టా టక్కరా’ ఫస్ట్ సింగిల్ ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చేత విజిల్స్, డ్యాన్స్ చేయించేలా ఉంటుంట.
ప్రభాస్, దిశా పటాని పై వచ్చే ఈ మాస్ బీట్ మామూలుగా ఉండదట. సంతోష్ నారాయణ్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే కల్కి ఫస్ట్ సింగిల్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే.. దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.