ఒక్క నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. అయితే.. నిన్న మొన్నటి వరకు యాక్షన్ సీక్వెన్స్ చేసిన దేవర.. ఇప్పుడు రొమాంటిక్ టచ్‌కు రెడీ అవుతున్నాడు.
Devara: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర సినిమా నుంచి ఒక రోజు ముందే ఫియర్ సాంగ్ వస్తోందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. భయానికే భయం పుట్టేలా ఈ సాంగ్ ఉంటుందనే హైప్ క్రియేట్ అవుతోంది. అనిరుధ్ ఇచ్చిన మాసివ్ ట్యూన్.. జైలర్ సినిమాలోని హుకుమ్ సాంగ్‌ను మరిపిస్తుందని అంటున్నారు. దీంతో.. దేవర ఫస్ట్ సాంగ్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంకొన్ని గంటల్లో ఈ సాంగ్ బయటికి రానుంది. ఈ సాంగ్ రిలీజ్ అవడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లాచెదురయ్యేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న దేవర సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్గా ముంబైలో వార్ 2 కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన యంగ్ టైగర్.. ప్రజెంట్ బర్త్ డే వెకేషన్లో ఉన్నాడు. తిరిగి రాగానే దేవర షూటింగ్లో జాయిన్ అవనున్నట్టుగా తెలుస్తోంది. మే 24 నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఇక్కడి నుంచి దేవర ప్రమోషన్స్ స్పీడప్ కానున్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని అందించింది. దీంతో దేవర పై భారీ అంచనాలున్నాయి.