»The Adulterated Oil Scandal In China Is Going Viral
China: చైనాలో కల్తీ నూనెల కుంభకోణం.. నెట్టింట వైరల్
చైనాలో విక్రయించే వంటనూనెలకు సంబంధించిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రమాదకరమైన రసాయనాలు తరలించే కంటైనర్లలో మంచి నూనెను తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
The adulterated oil scandal in China is going viral
China: దేన్నైనా కాపీ చేసే దేశం చైనా అని అందరికీ తెలుసు. అలాగే కల్తీ కూడా చేయగలదు. తాజాగా ఈ దేశంలో కల్తీ నూనెలకు సంబంధించి భారీ కుంభకోణం బయటపడింది. వంటకు వాడే నూనెలను తరలించే విధానం అక్కడి ప్రజలను గగుర్పాటుకు గురి చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ తరలించే కంటైనర్లను శుభ్రపర్చకుండా వాటిలో వంటనూనెలను తరలించడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతుంది. ఈ విషయం బయటకు రావడంతో చైనా ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తాము విషయాన్ని వంటల్లో ఉపయోగించామా అని నెట్టింట్లో వాపోతున్నారు.
వంటనూనెలను తరలించే ట్యాంకర్లనే ఇంధన రవాణాకు, సిరప్‌లకు తరలించేందుకు వాడినట్లు గుర్తించారు. వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండానే తిరిగి వంటనూనెలను తరలించినట్లు చైనా ప్రభుత్వానికి చెందిన బీజింగ్ న్యూస్ కథనంలో పేర్కొంది. చైనాలో ఇలా వంటనూనెలను తరలించడం అనేది బహిరంగ రహస్యమని ఆ పత్రిక వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఏం చేస్తుంది. ఆహార భద్రతకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని చైనా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది. అది విషమని తెలసి కూడా ప్రభుత్వం చూసి చూడకుండా వ్యవహరిస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సోషల్ మీడియా వీబోలో ఈ కుంభకోణం కథనం సర్క్యూలేట్ అవుతుంది.
ఈ కుంభకోణంలో చైనా ప్రభుత్వరంగ కంపెనీలు సినోగ్రెయిన్, హోప్‌ఫుల్ గ్రెయిన్ అండ్ ఆయిల్ గ్రూప్‌ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపూ సినోగ్రామ్ కంపెనీ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్యలకు పాల్పడిన ట్రక్కులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరో ప్రభుత్వం రంగ కంపెనీ హోప్‌ఫుల్ గ్రెయిన్ కూడా దర్యాప్తు చేపట్టినట్లు ఆ దేశ జాతీయ మీడియాకు వెల్లడించింది. ఇలాగే 2008లో కూడా ఆహార కల్తీ కుంభకోణం ఆ దేశాన్ని కుదిపేసింది. సన్‌లూ మిల్క్ కుంభకోణంగా దాన్ని వ్యవహరించారు. మెలామైన్ అనే కెమికల్‌ను పాలపౌడర్‌లో వాడడంతో దాదాపు 3,00,000 మంది చిన్నారులు ఆరోగ్యం దెబ్బతిందని, అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి.