Scotland: పురాణాల్లోని అరుదైన రాక్షస జీవి కోసం వెతుకులాట..!
పురాణాల్లో నెస్సీ అనే జీవి గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ ప్రత్యేక జీవి మెడ 6 అడుగులు ఉండేదని, అది ఎంతో అపరూపంగా ఉంటుందని మాట్లాడుకునేవారు. ఆ జీవి కోసం ఇప్పటికి కూడా పలువురు పరిశోధనలు చేస్తున్నారు. స్కాట్లాండ్లో ఆ జీవి ఉనికిని కనుగొనేందుకు కొన్ని వేల మంది పోటీపడి శోధిస్తున్నారు.
పురాణాల్లో ప్రస్తావించిన ఓ అరుదైన జీవి కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆ జీవి కోసం వందల మంది స్కాట్లాండ్ (Scotland)కు చేరుకున్నారు. ఆ ప్రత్యేక జీవి ఉనికిని నిరూపించి రికార్డు నెలకొల్పేందుకు పరితపించారు. ఇంతకీ ఆ ప్రత్యేక జీవి పేరేంటో తెలుసా..అదే నెస్సీ. లాచ్ అనే సరస్సులో ఆ జీవి ఉందని అందరూ భావిస్తున్నారు. అందుకే దానిని లాచ్ నెస్ మానిస్టర్ (Loch Ness Monster) అని పిలుస్తుంటారు.
నెస్సీ అనే జీవి ప్రస్తావన 6వ శతాబ్దంలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో దానిని కనుగొనేందుకు ఎందరో ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈసారి ఆ జీవిని కనిపెట్టాలని లాచ్ నెస్ సెంటర్ అధిపతి అయిన పాల్ నిక్సన్ తన బృందంతో వెతకడం మొదలెట్టారు. ఆ సరస్సు మొత్తాన్ని పరిశీలించేందుకు డ్రోన్లు, భూగర్భజల డ్రోన్లు, నీటిలోపల శబ్దాలను వినేందుకు హైడ్రోఫోన్లు, కెమెరాలు వంటివి తమతో తీసుకెళ్లారు.
సరస్సు మొత్తం 37 కిలోమీటర్ల పొడవు 780 అడుగుల లోతు ఉంటుంది. ఆ ప్రత్యేకమైన జీవిని చూసిన వారిలో గ్యారీ క్యాంప్‌బెల్ కూడా ఒకరు. ఆయన తన భార్యతో కలిసి రెండు దశాబ్దాలుగా లాచ్ నీస్ మానిస్టర్ కనిపించిన పలు ఘటనలను నమోదు చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు. 1996లో మానిస్టర్ జీవి ఉనికిని ఓ కథగా చెప్పుకునేవారు. ఓ లేక్ వద్ద కూర్చొని ఉండగా ఆ ీవిని చూశారు. ఆ జీవి మెడ పొడవు ఆరు అడుగులు ఉందని ప్రజలకు తెలిపారు.
1970, 1980 ప్రాంతాల్లో ఈ జీవి కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అయితే ఆ జీవి గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ సరస్సును చూసేందుకు అక్కడికి చాలా మంది రావడంతో స్కాట్లాండ్ ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం చేకూరింది. ఆ ప్రాంతంలో పర్యాటకులు వస్తుండటం వల్ల ఏడాదికి సుమారు 230 నుంచి 250 మిలియన్ డాలర్ల వ్యాపారం జరిగేది. లీచ్ నాస్ ఉనికిని కనుగొనేందుకు ఇప్పటికీ చాలా మంది అక్కడి చేరుకుని అన్వేషిస్తున్నారు.