»Bts Jungkook Seven 43 Days Becomes Fastest Song By Male Spotify
BTS జంగ్‌కూక్ సెవెన్ సాంగ్..సరికొత్త రికార్డు
BTS గ్రూపు సింగర్ జంగ్‌కూక్(jungkook) రాపర్ లాట్టోతో కలిసి ఆలపించిన సెవెన్(Seven) సాంగ్ స్పూటీఫై(spotify)లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తక్కువ సమయంలో (43 రోజులు) 500 మిలియన్ స్ట్రీమ్‌లను సాధించిన ఫస్ట్ మెయిల్ పాటగా నిలిచింది.
bts jungkook seven 43 days becomes fastest song by male spotify
BTS గ్రూపులోని దక్షిణ కొరియా సింగర్ జంగ్‌కూక్(jungkook) పాడిన ‘సెవెన్(Seven)’ పాట సరికొత్త రికార్డు సృష్టిచింది. Spotify చరిత్రలో 500 మిలియన్ స్ట్రీమ్‌లను అధిగమించిన ఫస్ట్ మెయిల్ సింగర్ పాటగా ఘనతను సాధించింది. అంతేకాదు కేవలం 43 రోజుల్లోనే వేగవంతంగా 500 మిలియన్ స్ట్రీమ్‌లను అధిగమించడం విశేషం. మొత్తంగా మైలీ సైరస్ (37 రోజులు) పాడిన “ఫ్లవర్స్” సాంగ్ తర్వాత, జంగ్‌కూక్ “సెవెన్” సాంగ్ స్పాటిఫైలో 500M స్ట్రీమ్‌లను అధిగమించిన 2వ వేగవంతమైన పాటగా కొనసాగుతుంది.
“సెవెన్” అనేది BTSకి చెందిన దక్షిణ కొరియా గాయకుడు జంగ్‌కూక్ అమెరికన్(amereican) రాపర్ లాట్టోతో పాడిన పాట ఇది. బిగ్ హిట్ మ్యూజిక్ ద్వారా జూలై 14, 2023న సింగిల్‌గా విడుదలైంది. దీనిని ఆండ్రూ వాట్, సర్కుట్, జోన్ బెలియన్, లాట్టో, థెరాన్ మకిల్ థామస్ రాశారు. వాట్, సర్కుట్ నిర్మించారు. ఈ పాట ఒక రొమాంటిక్ UK గ్యారేజ్ పాప్ పాట. ఓ ప్రియురాలు తన ప్రేమికుడితో గడపాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో ఈ పాటను రిలీజ్ చేయగా కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ అరుదైన రికార్డు సాధించింది.
ఈ పాట ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్(USA)లోని బిల్బోర్డ్ హాట్ 100, గ్లోబల్ 200లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ చార్టులలో జంగ్‌కూక్, లాట్టో మొదటి నంబర్ వన్‌గా ఉన్నారు. “సెవెన్” UK సింగిల్స్ చార్ట్‌లో మూడవ స్థానంలో ఉంది. చరిత్రలో సోలో కొరియన్ తొలి సింగిల్‌గా విడుదలై కొత్త రికార్డును నెలకొల్పింది. మిగిలిన చోట్ల ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, జపాన్, లిథువేనియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్లలో టాప్ 10 స్థానాల్లో నిలిచింది.