ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఉద్యోగికి (Employee) వారానికి ఒక్క లీవ్ కావాల్సిందే అదే వారానికి కేవలం ఐదు రోజుల మాత్రమే పని దినలు ఉంటే ఎలా ఉంటుంది. ఎంతో సరదాగా ఉంటుంది. కావాల్సినంత రిస్ట్ (Rest) దొరుకుతుంది. ఇంటిల్లిపాదితో హ్యాపీగా గడపవచ్చు. ఇలాంటి పద్దతులను ఇతర దేశాలే కాకుండా మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీ(Company). ఈ వారానికి ఐదు రోజులపాటు పది దినాల పద్దతిని తీసుకువస్తున్నాయి స్కాట్లాండ్ (Scotland) దేశం ఓ నూతన ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది.
ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులకు వారంలో నాలుగు రోజులు పనిచేసే విధానాన్ని అమలు చేయబోతోంది. పలు ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీ(Agency)ల్లో దీన్ని తొలుత అమలు చేయనున్నారు. పని రోజులను కుదించడం వల్ల వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి? లాభ, నష్టాలపై లోతైన పరిశీలన అనంతరం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల క్షేమం, పర్యావరణంపై ప్రభావం తగ్గించడం, ఉత్పత్తి (Product) పెంచడం అనేవి నాలుగు రోజుల పని విధానం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఏడాది పాటు ఇలా ఎంపిక చేసిన శాఖల్లో దీన్ని అమలు చేస్తారు.
మరోవైపు బ్రిటన్ (Britain) గతేడాదే నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి చూసింది. 61 సంస్థల్లోని 3,000 ఉద్యోగులకు ఆరు నెలల పాటు దీన్ని అమలు చేసి చూశారు. ప్రయోగం ముగిసిన తర్వాత మెజారిటీ ఎంప్లాయ్స్ వారంలో నాలుగు రోజుల పని విధానాన్నే ఎంపిక చేసుకున్నారు. అమెరికా(America), ఐర్లాండ్, ఆస్ట్రేలియాలోనూ ఇదే తరహా అధ్యయనాలు జరిగాయి. వీటిల్లో మెరుగైన ఫలితాలే కనిపించాయి. తద్వారా పనిదినాల కుదింపునకు సానుకూల పరిస్థితి ఏర్పడింది. పనిదినాల(working days)ను కుదించడం వల్ల ఉద్యోగులకే కాకుండా, సంస్థలకు కూడా అదనపు ఉత్పత్తితో అనుకూలతలు ఉంటున్నట్టు గుర్తించారు.