పోర్చుగల్(Portugal)లోని లెవీరా ప్రాంతంలో వింత ఘటన చోటు చేసుకుంది. లెవీరాలోని మద్యం తయారీ కంపెనీలో రెడ్ వైన్ (Red wine) తయారవుతుంటుంది. కంపెనీలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి చేరుతుంటుంది. ఈ ట్యాంకుల నుంచి బాటిల్స్ లో నింపి, వాటిని మార్కెట్ లోకి పంపిస్తుంటారు. కంపెనీ (Company) సిబ్బంది తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే మద్యం (Alcohol) నిల్వ చేసే ట్యాంకులు ఉన్నట్టుండి పేలిపోయాయి.దీంతో అందులో నిల్వ చేసిన సుమారు 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ నేల పాలైంది.
కంపెనీ పక్కనే ఉన్న ఓ ఇంటి బేస్ మెంట్ ను ముంచెత్తింది. ఆపై వరదలా రోడ్లను ముంచెత్తింది. రోడ్లు (Roads) వాలుగా ఉండడంతో వరద మొత్తం దగ్గర్లోని నదివైపుగా ప్రయాణించింది. మద్యం ఏరులా పారుతోందని రాజకీయ నాయకుల ప్రసంగాల్లో వింటుంటాం కానీ పోర్చుగల్ లోని ఓ చిన్న పట్టణవాసులు మాత్రం ఈ వైనాన్ని కళ్లారా చూశారు. ఏరులా పారడం కాదు.. ఏకంగా మద్యం వరదలనే చూశారు. వీధులను రెడ్ వైన్ ముంచెత్తడం చూసి ఇదేం వింత? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సహా ఎమర్జెన్సీ టీం(Emergency team)లు రంగంలోకి దిగి నది కలుషితం కాకుండా చర్యలు చేపట్టాయి. రెడ్ వైన్ వరదను పొలాల్లోకి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ రెడ్ వైన్ వరదను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B