ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేశారు. బంద్ ను ప్రజలు పట్టించుకోలేదని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ (Tweet) చేశారు. ‘మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా, నలభై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలేసినందుకు బంద్ కి పిలిస్తే, ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు (Movies) చూసుకుంటూ, షాపింగ్ లు చేసుకున్నారా?
అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని అని ట్వీట్ చేశారు.”ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) ఖైదీ నంబర్ 7691. అంటే.. 7+6+9+1=23. ఇది ఆయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్ల సంఖ్య. ఇది నమ్మశక్యం కాని యాదృచ్ఛికం” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు.. దీని వెనక గ్రహాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ (Skill development) కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టై, జైలుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దీన్ని ఖండించి బాబుకు మద్దతు ప్రకటించారు.
మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఓక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్ కి పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ , సినిమాలు చూసుకుంటూ, షాపింగ్లు చేసుకున్నారా ??? 😳😳😳 అవ్వ !!! 😱😱😱ఇంత కన్నా…