»Asia Cup 2023 Team Indias Fight With Sri Lanka Forecast Of Rain
AsiaCup2023: శ్రీలంకతో టీమిండియా ఢీ.. వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే.?
కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్‌కు ఈ రోజు వర్షం ముప్పు తప్పేలా లేదుని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంక ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. మరి వర్షం వస్తే ఏం జరుగుతుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది.
Asia Cup 2023 Team India's fight with Sri Lanka.. Forecast of rain
Asia Cup2023: ఆసియా కప్-2023 సూపర్ ఫోర్లో భాగంగా నేడు శ్రీలంక(Sri Lanka)తో టీమిండియా(Team India) తలపడనున్నది. టీమిండియా వరుసగా మూడోరోజు బరిలోకి దిగుతుంది. పాక్‌తో వర్షం కారణంగా రెండు రోజులు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే మూడోరోజు రెస్ట్ లేకుండా భారత్ బరిలోకి దిగబోతున్నది. పాక్(Pakistan)పై అజేయ విజయంతో మంచి జోరుతో శ్రీలంకపై గెలిచి ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవాలని భావిస్తున్నది. సూపర్-4 మ్యాచ్‌లో కొలంబో వేదికగా జరుగనున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు.
శ్రీలంక కొలంబోలో వర్షాలు కొనసాగే పరిస్థితి ఉంది. ఇప్పట్లో వాతావరణం మెరుగయ్యేలా కనిపించడం లేదు. భారత్ – శ్రీలంక మ్యాచ్ జరిగే మంగళవారం సైతం 90శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొలంబో 92శాతం మేఘాలు ఉన్నాయని, గాల్లో తేమ శాతం 77శాతంగా ఉండనుండగా.. ఉక్కపోత కూడా అధికంగానే ఉంది. ప్రస్తుతం సూపర్ ఫోర్ పాయింట్ల టేబుల్లో భారత్ – శ్రీలంక తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్‌పై రికార్డు విజయంతో భారత్ ఏకంగా 4.520 నెట్ రన్‌రేట్‌తో టాప్‌లో ఉండగా.. శ్రీలంక 0.42 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉన్నది. ఈ క్రమంలో టీమిండియా జట్టు లంకతో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత్ ఫైనల్‌కు మార్గం సుగమమం అవుతుంది.