హైదరాబాద్ పంజాగుట్ట(Panjagutta)లో మెరిడియన్ సంఘటన పై పోలీసు ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. తాత్కాలికంగా హోటల్ ను మూసివేశారు. బిర్యానీ(Biryani) తినేందుకని హోటల్ కు వెళ్లిన ఓ వ్యక్తి… ఎక్స్ ట్రా పెరుగు తీసుకు రమ్మని సిబ్బందిని అడగడంతో వారు దాడి చేయగా.. సదరు వ్యక్తి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) స్పందించారు. మెరిడియన్ రెస్టారెంట్ (Meridian Restaurant) ను తాత్కాలికంగా మూసేశారు. అలాగే తమముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్ పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే విషయాన్ని ఆయన తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ (Liaquat) అనే వ్యక్తి.. సోమవారం రోజు బిర్యానీ తినేందుకు స్థానికంగా ఉన్న హోటల్ కు వెళ్లాడు. అక్కడే బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాడు. అయితే తనకు పెరుగు చాలకపోవడంతో.. ఎక్కువ రైతా కావాలని సిబ్బందిని కోరాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే స్థానికుల సాయంతో గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు(Police).. హోటల్ కు చేరుకున్నారు. లియాకత్ తో పాటు హోటల్ సిబ్బందిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇంతలోనే లియాకత్ స్పృహ తప్పి పడిపోయాడు.
దీంతో పోలీసులు వెంటనే లియాకత్ ను స్థానిక డెక్కన్ హాస్పిటల్ (Deccan Hospital) కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. లియాకత్ మృతి చెందాడు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం లియాకత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి స్నేహితులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అతడి స్నేహితులు.. డెక్కన్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. పోలీసులతోపాటు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ https://t.co/SsCSrzSqU3pic.twitter.com/GujDSVtNrf