Meridian Owner And Staff are beat Customer, He is Death
Meridian Restaurant: హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది బిర్యానీ. డిఫరెంట్ టేస్ట్‌తో నోరూరించే బిర్యానీలను రెస్టారెంట్లు సర్వ్ చేస్తున్నాయి. సిటీలో ఓ 10 వరకు ఫేమస్ హోటళ్లు ఉన్నాయి. పంజాగుట్టలో ఉన్న మెరెడియన్ రెస్టారెంట్ ఒకటి. ఇక్కడ బిర్యానీ రుచి వేరే లెవల్.. ఓనర్, సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తిస్తారు. ఎక్స్ ట్రా పెరుగు ఇవ్వాలని అడిగితే కస్టమర్‌పై దాడి చేశారు. సిబ్బంది అయితే తొందరపడ్డారు అనుకోవచ్చు.. వారితో ఓనర్ కూడా చేతులు కలిపాడు.
లాస్ట్ డే
మెరిడియన్ బిర్యానీ రుచి నాలుకకు తగిలితే మళ్లీ అక్కడికే వెళతారు. లియాఖత్ అనే వ్యక్తి కూడా ఆదివారం రెస్టారెంట్‌కు వెళ్లాడు. పాపం అదే రోజు అతనికి లాస్ట్ డే అయ్యింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటున్నాడు. పెరుగు రుచిగా ఉండటంతో మరికొంచెం ఇవ్వాలని స్టాఫ్‌ను అడిగాడు. అదీ ఏదో చిన్న చితక హోటల్ అయితే.. తెస్తాం అనో.. లేదంటే లేదు అని చెప్పేవారు. రోజుకు లక్షల్లో కౌంటర్ కావడంతో, కస్టమర్‌తో వాదన ప్రారంభమైంది. తనకు కొంచెం పెరుగు కావాలని కస్టమర్ కూడా గట్టిగానే అడిగాడు. అలా మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. కస్టమర్ ఒక్కడు కాగా.. సిబ్బంది కలిసి దాడి చేశారు. అంతలో ఓనర్ రాగా.. విషయం తెలిపారు. అతను కూడా ఓ చేయి వేశాడు. ఇలా అందరూ కొట్టడంతో ఆ కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు.
కుప్పకూలిన కస్టమర్
హోటల్ వద్ద గొడవకు సంబంధించిన సమాచారం పంజాగుట్ట పోలీసులకు చేరింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కస్టమర్, సిబ్బందితో మాట్లాడారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ లియాఖత్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అతనిని సమీపంలో గల దక్కన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా నో యూజ్.. చికిత్స తీసుకుంటూ.. చనిపోయాడు. మరికొంచెం పెరుగు కావాలని అడిగిన పాపానికి హోటల్ సిబ్బంది దాడి చేశారు. టేస్టీ బిర్యానీ తినేందుకు వచ్చి.. దెబ్బలు తిని, చనిపోయాడు. కస్టమరే తమకు దేవుళ్లు అనే బోర్డులు కనిపిస్తాయి. మెరిడియన్ హోటల్ వ్యవహారం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. హోటల్‌కు వచ్చిన కస్టమర్‌ను చావగొట్టి, చనిపోయేందుకు కారణం అయ్యారు.
ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
విషయం తెలిసిన వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు ఎంఐఎం ఎమ్మెల్సీ రహమాత్ బేగ్ చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లియాఖత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరిడియన్ సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసుల తీరుపై మృతుడి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో సీపీ స్పందించారు. పంజాగుట్ట ఎస్సై శివశంకర్, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌ను సస్పెండ్ చేశారు.
మటన్ బిర్యానీ ఫేమస్
మెరిడియన్ హోటల్లో మటన్ బిర్యానీ, అందులో నంజుకునే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి చాలా మంది భోజన ప్రియులు ఫిదా అవుతారు. మిగతా ఫుడ్, స్టార్టర్స్ కూడా బాగుంటాయి. ఫుడ్ బాగుంటుందనే డిమాండ్ హోటల్ సిబ్బందిలో కనిపిస్తోంది. వారికి ఓనర్ వత్తాసు పలుకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. పెరుగు, సలాడ్ ఎక్కువ అడగొద్దు.. అడిగారనుకో.. ఇక అంతే సంగతులు అని కామెంట్స్ చేస్తున్నారు. నిజమే.. పెరుగు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని కనికరం లేకుండా దాడి చేసి, చనిపోయేందుకు కారణం అయ్యారు. ఏదీ ఏమైనప్పటికీ మెరిడియన్ హోటల్ సిబ్బంది, ఓనర్ ప్రవర్తన ముమ్మాటికీ తప్పు.. వారికి తగిన శిక్ష పడాల్సిందేనని పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అలాగే బాయ్‌కాట్ మెరిడియన్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఇండియాలో ట్రెండ్ అవుతోంది.