తాను కూడా కేయూ (KU) అధికారుల బాధితురాలినని అన్ని అర్హతలు ఉన్నా తనకు పీహెచ్డీ అడ్మిషన్ ఇవ్వలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో విద్యార్థి సంఘాల జాక్ నేతల దీక్షకు సీతక్క సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో విద్యార్థులతో కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.‘ఉద్యమాల, పోరాటాల గడ్డ వరంగల్(Warangal)కు కేయు తలమానికం. త్యాగాల స్ఫూర్తిని నింపుకున్న ఎందరినో కాకతీయ యూనివర్సిటీ దేశానికి అందించిందన్నారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమ స్ఫూర్తిని చంపేశారన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పక్కదారి పడుతోందని సీతక్క మండిపడ్డారు. మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలని అడిగితే సీట్లు ఇవ్వట్లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు కావాలంటే బల్రు, గొర్లు తీసుకోనని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు (Police) వ్యవస్థ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న పోలీసులు విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. స్టూడెంట్స్(Students)లను గుండాలుగా చిత్రీకరించొద్దని కోరారు. విద్యార్థుల చేతులు, కాళ్లు విరగ్గొట్టారని, చదువుకునే విద్యార్థులపై ఇలా ప్రవర్తించడం ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ(University)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకే విద్యార్థులపై కేసులు పెట్టించి పోలీసులచే దాడి చేయించిన బాధ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన పోలీసు అధికారులను ఉద్యోగాల(Jobs)నుంచి తొలగించాలని చెప్పారు. దాడిలో గాయపడిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే దీక్షలు ఉదృతం చేస్తామని సీతక్కహెచ్చరించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం గానీ, మంత్రులు (Ministers) గాని కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు