RGV: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (pawan kalyan) ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. స్కామ్‌కు సంబంధించి 9 ప్రశ్నలు వేశారు. ఒక్క పదంతో జవాబు ఇవ్వాలని కోరారు.
స్కిల్ స్కాం (skill scam) జరిగిందా లేదా అని అడిగారు. కుంభకోణం జరిగి ఉంటే చంద్రబాబుకు తెలియకుండా జరిగిందా..? 300 కోట్లకు పైగా ప్రజాధనం ప్రొసిజర్స్ ఫాలొ కాకుండా.. ఆఫీసర్స్ చెబుతున్నా వినకుండా నిధులు రిలీజ్ చేశారా..? లేదా అని అడిగారు. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ చంద్రబాబుకు స్కామ్ గురించి తెలిస్తే.. ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదు..? ఎఫ్ఐఆర్ (FIR) అనేది ముందుగా దాఖలు చేసే ప్రాసెస్ మాత్రమే.. విచారణలో సేకరించిన సమాచారాన్ని బట్టి ఎవరి పైరు యాడ్ చేయచ్చనే విషయం తెలియదా? అని అడిగారు.
డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని జడ్జీ నమ్మి బెయిల్ ఇవ్వకపోవడం తప్పా..? సెక్షన్ 409 అప్లై అవుతోందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జీ అవినీతి పరుడా..? 40 ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు.. వాళ్లు చేసే పనులను బట్టి అనే విషయం తెలియదా..? స్కిల్ స్కామ్ అంటే ఏమీ అర్థమయ్యిందో.. అందులో తప్పులేంటో వీడియోలో కెమెరా ముందు చూస్తూ వివరించగలరా..? అని వర్మ అడిగారు.